Current Date: 04 Jul, 2024

జగన్ ప్రమాణ స్వీకారం టైం ఫిక్స్... వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2019 కి మించి భారీ విజయం సాధిస్తామని  వైసీపి మరో సారి ధీమా వ్యక్తం చేస్తుంది. జూన్ 9 వ తేదీన ఉదయం 9 గంటల 38 నిమిషాలకు  విశాఖ వేదికగా  జగన్ ప్రయాణ స్వీకారానికి సిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా  పిలుపునిచ్చింది. జూన్ 4 న చరిత్ర తిరగరాసే ఫలితాలను  జగన్ సాధిస్తారని  ఆశాభావం వ్యక్తం చేసింది. శ్రేణులు సంబరాలకు సిద్దంగా ఉండాలని  కోరుతూ ఎక్స్ లో  ఓ ఫోటోను షేర్ చేసింది.