Current Date: 28 Nov, 2024

ఆరు నెలల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్‌: మంత్రి టీజీ భరత్‌

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ‘‘గత ప్రభుత్వం న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాం. బెంచ్‌ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చు. ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయి. కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమే’’ అని మంత్రి తెలిపారు. 

Share