భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కీలకమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. జట్టులో మూడు మార్పులు చేశామని కెప్టెన్ రోహిత్ వెల్లడించారు. పేసర్ మహ్మద్ సిరాజ్, మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టి పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. మాట్ హెన్రీ స్థానంలో సాంట్నర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.