టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితో రాజమౌళి సినిమా తీశారు. కానీ అల్లు అర్జున్‌తో మాత్రం ఇప్పటి వరకు తీయలేదు. మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్ తో విభేదాలు తలెత్తాయి. సినిమా విడుదలకు సంబంధించిన విషయంలో వివాదం రేకెత్తింది. దీంతో అల్లు అరవింద్‌ను రాజమౌళి పక్కన పెట్టేశాడంటారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయగల అల్లు అరవింద్‌తో మగధీర తర్వాత రాజమౌళి సినిమా చేయలేదు. అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్‌తో కూడా సినిమా చేయలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్, రవితేజ తదితర హీరోలతో రాజమౌళి సినిమాలు తీశాడు. వారి కెరీర్‌కి తిరుగులేని బాటలు వేశారు. కానీ అల్లు అర్జున్‌తో ఒక్క సినిమా కూడా తీయలేదు. దాంతో భవిష్యత్తులోనైనా రాజమౌళి తమ అభిమాన హీరోతో సినిమా తీస్తాడేమోనని బన్నీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Share