Current Date: 27 Nov, 2024

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84) శనివారం మరణించారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఢిల్లీలో కన్నమూశారు. ఆమె స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె. 1940లో జన్మించిన ఆమె.. వేల సంఖ్యలో భరతనాట్య ప్రదర్శనలిచ్చారు. ఆమె ప్రతిభకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు. డ్యాన్స్‌తో పాటు, యామిని కర్ణాటక గాత్ర సంగీతం, వీణ వాయించడంలో కూడా శిక్షణ తీసుకున్నారు. విభిన్న అభిరుచులు ఉన్నప్పటికీ, కృష్ణమూర్తి ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడిపై దృష్టి సారించారు. ఈ నృత్య రూపాలను ప్రదర్శించి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాడు. 1990లో ఆమె ఢిల్లీలో సొంత డ్యాన్స్ స్టూడియో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ను ప్రారంభించారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా (రెసిడెంట్ డ్యాన్సర్) గౌరవం పొందారు. కూచిపూడికి టార్చ్ బేరర్‌గా మారారు. కళారంగానికి చేసిన సేవలకుగానూ కృష్ణ మూర్తి... పద్మశ్రీ (1968), సంగీత నాటక అకాడమీ అవార్డు (1977), పద్మ భూషణ్ (2001), పద్మ విభూషణ్ (2016)తో సహా అనేక అవార్డులను అందుకున్నారు.

Share