Current Date: 25 Nov, 2024

పిల్లలపై సమంత కామెంట్స్ గంటల్లోనే నాగచైతన్య రియాక్ట్

సీనియర్ హీరోయిన్ సమంత 2 రోజుల క్రితం తాను తల్లి కావాలని కలలు కన్నానని వెల్లడించింది. అదొక పరిపూర్ణమైన అనుభూతి అని, మాతృత్వాన్ని ఆస్వాదించడానికి వయసు అడ్డంకి కాదని చెప్పుకొచ్చింది.సమంత అలా స్టేట్ మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఆమె మాజీ భర్త నాగచైతన్య నుంచి ఇదే అంశంపై స్టేట్ మెంట్ రావడం విశేషం. “హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే బాగుంటుంది.” అనేది నాగచైతన్య స్టేట్ మెంట్. అయితే వెంకీ మామలా నలుగురు పిల్లలు మాత్రం వద్దని చమత్కరించాడు.వైవాహిక బంధానికి ముగింపు పలికి, విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ ఇలా పిల్లలపై స్టేట్ మెంట్ ఇవ్వడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. డిసెంబరు 4న నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ.. సమంత మాత్రం ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంది.

Share