Current Date: 04 Jul, 2024

అమల్లోకి కొత్త న్యాయ చట్టం.. తొలి కేసు నమోదు

భారతీయ న్యాయ సంహిత కింద ఢల్లీలో తొలి కేసు నమోదైంది.  ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. న్యూఢల్లీ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 కింద పోలీసులు  సోమవారం  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దేశ రాజధానిలో ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్‌ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించారు. అతని  దుకాణం ఎన్‌డీఆర్‌ఎస్‌ సమీపంలోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Share