భారత ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై వేటు పడబోతోందా..? ఇటీవల ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్ చేరకుండానే భారత్ జట్టు ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో జట్టు ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోందనే విమర్శలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ కూడా ఇదే మాట అంది. బీసీసీఐ సైతం కెప్టెన్‌ను మార్చడంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పు జరగని పక్షంలో జట్టు ఆటతీరులో కూడా మార్పు తీసుకురావడం కష్టమని.. ప్రపంచకప్ వైఫల్యం మీద సమీక్ష జరగడం, చర్యలు చేపట్టడం కూడా చాలా అవసరమని, లేదంటే జట్టులో ఉదాసీనత పెరిగిపోతుందని బోర్డులో చర్చ జరుగుతోంది. దాంతో హర్మన్‌పై వేటు పడటం ఖాయమని వార్తలు వస్తున్నాయి.