టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కీ దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.జానీ మాస్టర్ తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్నాడు. కానీ.. ఇప్పుడు పదవి కూడా ఊడిపోయింది. అంతేకాదు ఇండస్ట్రీలో మరే సినిమాకు వర్క్ చేయకుండా కొరియోగ్రాఫర్స్ అసోషియేషన్స్ సభ్యత్వంను కూడా జానీ మాస్టర్‌కి లేకుండా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ విషయమై భేటీ అయ్యి జానీ మాస్టర్ పై తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించడం జరిగింది. లైంగిక వేధింపులకు గురైన బాధిత లేడీ కొరియోగ్రాఫర్ కి అండగా నిలిచేందుకు ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చారు. పలువురు ప్రముఖులు తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.