పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు 21వ తేదీ సోమవారము ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా అవుతుందని నిరుద్యోగులు సద్వినియెగం చేసుకోవాలని కలెక్టర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ ఐటిఐ డిగ్రీ, ఎంబీఏ చదువుకొని ఉన్న నిరుద్యోగులు 18-30 సంవత్సరాల మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మెలలో పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు 18 రకాల కంపెనీలుకు చెందిన ప్రతినిధులు విచ్చేయుచున్నారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థనను వారు కంపెనీలకు ఎంపిక చేసుకుంటారని నిరుద్యోగ యువతీ యువకులు తమ వివరాలతో రావాలని తెలియజేశారు. తమ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి రిఫరెన్స్ నెంబర్ తో పాటు అభ్యర్థి బయోడేటా ఆధార్ కార్డు విద్యాలయ సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు జిరాక్స్ ప్రతులను పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావాలని తెలియజేశారు. వివరములకు ఫోన్ నెంబర్లు 63051 10947, 89788 78557 ఫోన్ నెంబర్లుకు సంప్రదించ వచ్చని తెలియజేశారు ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు వినియెగించు కోవాలని కలెక్టర్ ఏ శ్యామ ప్రసాద్ తెలియజేశారు.