సీఎం చంద్రబాబు ఇటీవల ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్‌తో మాట్లాడారు.ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు చేదోడుగా నిలుస్తున్నానని చెప్పారు. అయితే ఆడపిల్ల చదువు కష్టం కాకూడదని.. రజినీకాంత్‌కు ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు గంటల వ్యవధిలో రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీవో నిమ్మగడ్డ శ్రీనివాస్ ‘అపే ఈసిటీ’ ఆటో తీసుకున్నారు. ఆ ఆటోను గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి.బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజినీకాంత్‌కు ఆటో తాళాలు అందజేశారు