దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేయబోతోంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రూపొందించిన ఒక ప్రత్యేక యాప్ను తాజాగా ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. ఇందులోని లోటుపాట్లను సవరించి త్వరలోనే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరిగే కేసుల విచారణను సామాన్యులు సైతం ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలగనుంది.