ఐపీఎల్ 2024 ఫైనల్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో అదరగొట్టిన హైదరాబాద్ టీమ్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో టైటిల్ పోరు జరగనుంది.మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 35, రాహుల్ త్రిపాటి 37 పరుగులు చేయగా.. మిడిల్ ఓవర్లలో క్లాసెన్ దూకుడుగా ఆడి 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఫెయిలైంది. జైశ్వాల్ 42, ధ్రువ్ జురైల్ 56 పరుగులు చేసినా.. ఆఖరిలో ఒత్తిడికి గురై 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. సీజన్‌లో తొలిసారి హైదరాబాద్ పేసర్లు ఫెయిలవగా.. పార్ట్ టైమ్ స్పిన్నర్లు షబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ ఆదుకుని 5 వికెట్లు తీసి హైదరాబాద్‌ను గెలిపించారు. కోల్‌కతా, హైదరాబాద్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత మంగళవారం కోల్‌కతా చేతిలో ఓడిన హైదరాబాద్.. ఫైనల్లో రివేంజ్ తీర్చుకుని కప్ గెలవడానికి ఇదే లక్కీ ఛాన్స్!