స్పీకర్ పదవినైనా వదులుకుంటా నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజు కు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదు.పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు. రోడ్డుమీద పహారా కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు . ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. నేను నాలుగు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఆర్టిసి డిఎం ధీరజ్ ని నిలదీసిన అయ్యన్న . రైతులు ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారు. వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజ్ కి ఎలా ఇస్తారు. నేను వద్దంటున్నా ఎందుకు లీజు దారులకు అధికారులు సహకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతా, అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతా.
Share