ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సైనిక అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అణ్వాయుధ సామర్థ్యం కల్గిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పుతిన్ ఆదేశాలతో రష్యా సైనిక అధికారులు అణు క్షిపణులను పరీక్షించడం ప్రారంభించారు. కమ్‌చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపింది.