ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కోపం తెప్పించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉండాలని పదే పదే చంద్రబాబు చెప్తున్నారు. అయినా సరే కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు.ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితా రెడ్డి రాయచోటిలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో.. ఆయన బదులు హరితా రెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్ల చూడాలని, తన వాహనానికి ఎస్కార్ట్‌గా రావాలని స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చారు. కానీ ఎస్సై కాస్త ఆలస్యంగా రావడంతో.. మంత్రి సతీమణి ఏక వచనంతో పరుషంగా మాట్లాడారు.తెల్లారిందా? మేం ఏ టైమ్‌కి చేరుకున్నామో తెలుసా?’ అంటూ మంత్రి సతీమణి హరితారెడ్డి అన్నారు. కాన్ఫరెన్స్ ఉందని, అందుకే ఆలస్యమైందని ఎస్సై చెప్పగ ‘ఏం కాన్ఫరెన్స్ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకుందా? పెళ్లికొచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని తెలీదా?’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
Share