రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలెక్టర్ల సదస్సులో తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు 17% తగ్గాయని పేర్కొన్నారు. 2023 జూన్-2024 జనవరిలో మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్-2025 జనవరి వరకు 16,809 నేరాలు జరిగాయి. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. మరోవైపు ప్రతిపక్షం వైసీపీ మాత్రం రోజురోజుకీ.. మహిళలపై నేరాలు భారీగా పెరిగిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. కానీ.. కూటమి ప్రభుత్వం నుంచి స్పందనం పెద్దగా కనిపించడం లేదు.