విమానాల ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే దీక్షా స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలించడం జరిగిందని ఆయన తెలిపారు. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం జనవరి 20 వరకూ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో తరలించే వారు. భక్తుల ఇబ్బందులు తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయ్యప్ప దీక్షా స్వాముల ఇరుముడికి సంబంధించి నిబంధనలను సడలించారు.
Share