తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. అపర కుబేరుడు. భక్తులు ఇచ్చే కానుకలతో అంతకంతకు పెరుగుతున్న ఆదాయంతో వెంకన్న ఆస్తుల విలువ అమాంతంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో విరాళాల వెల్లువ శ్రీవారి రూ కోట్ల లో ఆదాయంగా వస్తోంది. ఈ నెల 17 నుంచి 27 వరకు పది రోజుల్లో శ్రీవారికి భక్తులు విరాళంగా సమర్పించిన విరాళాల విలువ రూ. 30 కోట్లకు పైగానే ఉంది. ఈనెల 18న టిటిడి నిర్వహిస్తున్న ఎస్వీ అన్నదానం, ఎస్ వి ప్రాణదానం, ఎస్వీ విద్యాదానం విభాగాలకు రూ. 1.23 కోట్ల విరాళం అందింది. కర్ణాటకలోని బళ్లారి కి చెందిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ మేరకు డీడీలను తిరుమల లో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు అందజేశారు. ఇందులో రూ. 1,01,11,111 ఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు, రూ. 11,11,111 విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ కు దాతలు అందజేశారు. దాతలను టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించి సత్కరించారు.
Share