Current Date: 25 Sep, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం ఆ ఏడు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ  అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Share