Current Date: 05 Oct, 2024

తాండవకు జలకళ

విశాఖ తూర్పు గోదావరి జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించే తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టులో భారీ వర్షాలకు వరద నీరు చేరుకుంటుంది. భారీగా వరదనీరు చేరుతుండటంతో రిజర్వాయర్ నీటితో నిండిపోతుంది. భారీ వర్షాలకు ముందు రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదేమోనని రైతులు ఆందోళన చెందారు. ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు. పూర్తి స్థాయిలో నీరు నీటితో 4060 ఎంసిఎఫ్ టి నీటి నిల్వలు ఉంటాయి. ప్రస్తుతం నీటిమట్టం 366.90 అడుగులకు చేరింది. 2331 ఎంసిఎఫ్ టి ల నీరు ఉంది. భారీ వర్షాలకు 2291 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లగా రిజర్వాయర్లోకి చేరుతుంది. ఆదివారం ఉదయానికి రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో 5మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాండవ జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్ పరిస్థితిని సమీక్షిస్తున్నామని రిజర్వాయర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనురాధ తెలిపారు. 

Share