ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి దుబాయ్‌లో బంపరాఫర్ తగిలింది. ఉపాధి కోసం దుబాయ్ వెళితే జాక్‌పాట్ తగిలింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయనకు లాటరీలో ఊహించని విధంగా ప్రైజ్‌మనీ దక్కింది.ఏపీకి చెందిన బోరుగడ్డ నాగేంద్ర ఉపాధి కోసం 2017లో దుబాయ్ వెళ్లారు. అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ.. తన డబ్బును 2019 నుంచి అక్కడి నేషనల్ బాండ్లలో పొదుపు చేస్తున్నారు. ప్రతి నెలా దాదాపు రూ.2,271తో అక్కడి బాండ్లలో పొదుపు చేసుకుంటున్నారు. అయితే ఈ సేవింగ్ స్కీమ్ కట్టి పొదుపు చేస్తున్నవారికిరివార్డు కింద లక్కీ డ్రా తీస్తారు.
ఈ లక్కీ డ్రాలో గ్రాండ్ ప్రైజ్ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్ర విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. ఆయనకు ప్రైజ్‌మనీ కింద రూ.2.25 కోట్లను గెలుచుకున్నారు. నాగేంద్రకు 18 ఏళ్ల కూతురు , 16 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారి చదువు కోసం డబ్బులు పొదుపు చేస్తుంటే.. లక్కీ డ్రా రూపంలో కూడా అదృష్టం వరించింది.
Share