Current Date: 27 Nov, 2024

డయేరియాబారిన పడిన గుర్ల గ్రామాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్...

గుర్ల మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం అతిసారం బారిన పడిన వారికి అత్యుత్తమ వైద్య సహాయం అందిస్తున్నామని, వారంతా వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే  గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి భాదితులకు చికిత్స అందించడంతో పాటు జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో చేర్పించి వారికి అందుతున్న వైద్య సహాయంపై పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.  డయేరియా భాదితుల చికిత్స కోసం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారులు, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. యస్. భాస్కరరావు వివరించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులపై జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వరరావు మంత్రికి వివరించారు.

Share