అరకు అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అరకు అందాలను వీక్షించేందుకు రైళ్లకు అదనపు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయిం తీసుకుంది. పర్యాటకుల సౌకర్యార్థం, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించాలని నిర్ణయించింది. విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు డిసెంబర్ 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 29, 31 తేదీల్లో అదనపు కోచ్‌తో ప్రయాణిస్తుంది. కిరండూల్ నుంచి బయలుదేరే కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 2025 జనవరి 1 తేదీల్లో అదనపు కోచ్‌తో ప్రయాణిస్తుంది. 2025 మార్చి నుంచి అమలులోకి వచ్చే వాల్తేర్ డివిజన్ ఒరిజిన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లను మార్చాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది.
Share