Current Date: 04 Jul, 2024

నోటిదురుసుతో ట్రోల్ ఐటెంగా తెలుగు క్రికెటర్ రాయుడు

ఐపీఎల్ 2024 సందర్భంగా విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టునుఉద్దేశించిటీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. విరాట్, ఆర్సీబీఫ్యాన్స్..రాయుడినిఉద్దేశిస్తూట్రోల్స్చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు కామెంటరీ చేస్తుండగా అంబటిరాయుడును ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. జోకర్ అని వ్యాఖ్యానించాడు.ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆరెంజ్ రంగు కోటు ధరించిన రాయుడు.. కేకేఆర్ గెలిచిన తర్వాత బ్లూ జెర్సీకి మారిపోయాడు. దీంతో తోటి కామెంటేటర్లుగా ఉన్న కెవిన్ పీటర్సన్, మాథ్యూ హేడెన్‌లు రాయుడును ఆటపట్టించారు. వీటికి బదులిచ్చిన రాయుడు.. "నేను బాగా ఆడిన జట్టుకు మద్దతిస్తా.. ఫైనల్‌కు చేరిన రెండు జట్లకూ మద్దతిస్తా" అని వ్యాఖ్యానించాడు. దీంతో కెవిన్ పీటర్సన్ నువ్వొక జోకర్ (సరదాగా ఉండే వ్యక్తివి) అంటూ రాయుడును సంబోధించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ఫ్యాన్స్.. ట్రోల్స్ ముమ్మరం చేశారు. కెవిన్ పీటర్సన్ సరదాగా అన్న మాటలను హైలైట్ చేస్తూ.. రాయుడు ఒక జోకర్ అని కామెంట్లు చేశారు. దీంతో రాయుడు పేరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన కెవిన్ పీటర్సన్.. "భారత క్రికెటర్లను (ప్రస్తుతం అంబటి రాయుడు) ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఇప్పటికైనా దానికి ముగింపు పలకాలి. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ అనంతరం నేను, రాయుడు సరదాగా మాట్లాడుకున్నాం. వాటిని పట్టుకుని.. రాయుడిని టార్గెట్‌గా చేస్తూ.. విమర్శలు, ట్రోల్స్ చేయడం బాధాకరం. ప్లీజ్ ఇప్పటికైనా దాన్ని ఆపేయండి" అని కెవిన్ పీటర్సన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.