Current Date: 26 Nov, 2024

రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇపుడు రెండో దశ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.63,246 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును మాధవరం మిల్క్‌ కాలనీ - సిరుచ్చేరి, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి, మాధవరం నుంచి షోలింగనల్లూరు వరకు మూడు మార్గాల్లో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, పూందమల్లి నుంచి లైట్‌ హౌస్‌ మార్గంలో డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నడపడంపై అధికారులు దృష్టిసారించారు. ఇందుకోసం మూడు బోగీలతో కూడిన 36 మెట్రో రైళ్ళ తయారీ భోగీలని ఆల్‌స్టోమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ తయారు చేస్తోంది. 

Share