కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు. ఒక బాలుడు ఉన్నారు. ఈ హాస్టల్లో మొత్తం 86 మంది పిల్లలు ఉంటున్నారు. వీరిలో 27 మంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 5గురిని సోమవారం ఉదయం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్లో ఓకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఉంటున్నారు. ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్లో ఉంటూ, స్థానికంగా ఉన్న పాఠశాలలో వీరు చదువుతున్నారు. హాస్టల్ లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు. ఈ బిర్యాని తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు నిర్వాహకులు సమాచారం పంపారు. తల్లిదండ్రులు వచ్చి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో చింతపల్లి మండలానికి చెందిన శద్ద, భవాని ,అనే ఆడపిల్లలు మరణించారు.