ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది. కాగా గురువారం చిన వెంకన్న కల్యాణం తంతును అర్చకులు వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితుడై, పెండ్లి కుమారుడిగా సర్వజగరకుడైన శ్రీవారు. బుగ్గన దుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ ఆండాళ్. దేవేరులను పరిణయమాడారు. ఈ కల్యాణ ఘడియలో స్వామి చిన్న మంగళ స్వరూపాన్ని వీక్షించి భక్తులు తరించారు. ఈ బద్భుత దృశ్యం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆవిష్కృతమైంది.