Current Date: 05 Oct, 2024

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ మరో బాంబు చిక్కుల్లో సెబీ చీఫ్‌

అదానీ గ్రూప్‌పై ఏడాదన్నర వ్యవధిలోనే హిండెన్‌బర్గ్‌ మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచిన కుట్రను ఛేదిస్తూ ఈసారి నేరుగా సెబీ చీఫ్‌ మాధవి పురి బచ్‌పైనే ఆరోపణలు చేసింది. షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెర్ముడా, మారిషస్‌ ఫండ్లలో మాధవి, ఆమె భర్త ధవల్‌ బచ్‌కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది. ఓ విజిల్ బ్లోయర్ అందించిన పత్రాల ఆధారంగా హిండెన్‌బర్గ్‌ ఈ ఆరోపణలు చేసింది. మాధవి దంపతులు 2015లో అదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా.. ఆ తర్వాత అంటే 2017లో మాధవి బచ్‌ సెబీలో శాశ్వత డైరెక్టర్‌ పదవి చేపట్టారు. అనంతరం 2022 మార్చిలో సెబీ చీఫ్‌గా నియమితులయ్యారు. సెబీ చైర్‌పర్సన్‌గా తన నియంత్రణ పరిధిలోకి వచ్చే వేలాది మ్యూచువల్‌ ఫండ్లు ఉండగా.. తాను, తన భర్త మాత్రం అతి తక్కువ ఆస్తులతో కూడిన, హై రిస్క్‌ ప్రాంతాల్లో ఏర్పాటైన, అదానీ అక్రమ నిధుల మళ్లింపు కుంభకోణంతో సంబంధాలున్న మల్టీ లేయర్డ్‌ విదేశీ ఫండ్లలో పెట్టుబడి పెట్టారని విజిల్ బ్లోయర్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది. 

Share