Current Date: 02 Apr, 2025

Vijayasanthi reject the chiranjeevi movie

చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ.. విజయశాంతి నో చెప్పారు. టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ పెయిర్‌లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. స్వయంకృషి, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్.. ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటిగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఇండస్ట్రీకే గ్యాప్‌ ఇచ్చారు. చాలా ఏళ్లవరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు.

విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీమ్‌ సంప్రదించిన మాట వాస్తమేనట. కానీ రాములమ్మ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్‌కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట.

ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. పొలిటికల్‌గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే.