Current Date: 27 Nov, 2024

నాకు 900 మందితో భద్రత కల్పించండి - జగన్ డిమాండ్

జగన్​కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. అయితే, సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె, బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది.. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ గురించి అనుకుంటే పొరపాటే! మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతకు సంబంధించిన లెక్కలివి. ఎన్నికల్లో ఓడిన జగన్​ తాజాగా తనకు జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేయడం గమనార్హం.

Share