Current Date: 26 Nov, 2024

ఏపీలో విచిత్రం ఒకవైపు వానలు మరోవైపు ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు వానలు, మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రుతుపవనాలు ప్రవేశించినా.. కొన్ని జిల్లాల్లో వేసవికాలం మాదిరిగా ఎండలు, వడగాడ్పులు కొనసాగుతున్నాయి.. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. మే నెల వరకు ఎండ తీవ్రత ఉందని.. జూన్‌లో ఎండకు తోడు ఉక్కపోత కూడా మొదలైంది.వేసవికాలంలా క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఒక మోస్తరు నుంచి భారీవర్షం పడుతోంది. ఆ వాన తర్వాత మళ్లీ ఎండ తీవ్రత, ఉక్కపోత ఉంటోంది. రాష్ట్రంలో వాతావరణం చల్లబడడం లేదు.. ఇంకా వేడెక్కుతోంది.

Share