ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని.. మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. దాంతో టీడీపీ, జనసేన నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని..మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈవీఎంల బదులు బ్యాలెట్లను ఉపయోగించాలని ట్వీట్ చేశారు.2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత.. దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మళ్లీ చర్చ మొదలైంది. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంల అంశంపై స్పందించారు.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని అభిప్రాయపడ్డారు.
Share