Current Date: 07 Oct, 2024

నెల్లూరు సెంట్రల్ జైలుకి ఈరోజు వైయస్ జగన్

మాజీ సీఎం వైయస్ జగన్ ఈరోజు నెల్లూరు జైలుకి వెళ్లనున్నారు. అక్కడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు.పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి అరెస్టవడం, మాచర్ల కోర్టు 14 రోజులు విధించి నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పంపిన సంగతి తెలిసిందే.ఎన్నికల ఫలితాల తర్వాత తాడేపల్లిలోని తన ఇంట్లో ఇప్పటి వరకు నాయకులతో మాట్లాడిన జగన్.. బయటికి వచ్చి మీడియాతో లేదా నాయకులతో మాట్లాడింది లేదు. ఈరోజు జైలు వద్ద మీడియాతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.

Share