ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తాను 37 రోజుల్లో చాలా కోల్పోయానని, తన ఫ్యామిలీ, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నానని చెప్పారు. సత్యం అనేది ఏదోరోజు బయటపడుతుందన్నారు. తన కుటుంబం పడిన కష్టం, తనను ఎన్నటికీ వేదనకు గురి చేస్తూనే ఉంటుందని చెప్పారు. కాగా, ఓ సహాయ నృత్య దర్శకురాలు జానీ మాస్టర్‌పై ఫిర్యాదుతో చేయడంతో ఆయన అరెస్టయి విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైల్లో గడిపారు.