ఏపీలో ఇంకా విచిత్ర వాతావరణం నెలకొంది.. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ్రోణి, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు బలహీనపడినది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈరోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది