సమాజంలో అక్కడక్కడ ప్రేమ వివాహాలకు పెద్దలు నిరాకరణ చెప్తున్నప్పటికీ.. చాలా వరకు తల్లిదండ్రుల నుంచి గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ట్రాన్స్ జెండర్లను యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ మల్యాల.. అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. సాధారణ వివాహం కాదు.. ప్రేమ వివాహం. అది కూడా పెద్దలను ఒప్పించి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస్‌కు కరుణాంజలితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పాడు. తాను ప్రేమిస్తున్నది ఓ అమ్మాయిని కాదు.. ట్రాన్స్ జెండర్‌ను అని చెప్పగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కుటుంబ సభ్యులతో పూర్తిగా మాట్లాడి వారి ప్రేమను వివరించాడు. చేసేదేమిలేక కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు.