Current Date: 27 Nov, 2024

ఇద్దరు ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయుల గల్లంతు

మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం సరాయివలసలో దారుణం చోటుచేసుకుoది. ఇక్కడి ఏకలవ్య పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు కొండవాగు దాటుతుండగా వరద ఉధృతంగా రావటం ల్తో వాగులో కొట్టుకుపోయారు. వారిలో ఒకరి మృతదేహం బయటపడగా మరో ఉపాధ్యాయుడి ఆచూకీ తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మంత్రి సంధ్యారాణి జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. పాఠశాలలోని జాగ్రఫీ సోషల్ టీచర్ గా హారతి (హర్యానా), వార్డెన్ టీచర్ గా మహేష్ (హర్యానా) 45రోజుల క్రితమే ఇక్కడ విధుల్లో చేరారు. పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం వారిద్దరూ సాలూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.  కొండ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కారణంగా చిట్టిగెడ్డ వాగు పొంగి పొర్లుతోంది. దానిని గమనించ లేకపోవడంతో శుక్రవారం వారిద్దరూ స్కూటీతో వాగులో దిగగా అదే సమయంలో నది మతింత ఉద్ధృతమైంది. దానిని గమనించక వారు వాగులో కొట్టుకుపోయారు. ఉపాధ్యాయురాలు హారతి (హర్యానా) మృతదేహం లభ్యం కాగా, మహేష్ మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

Share