లోక్సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతోఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలపాలని నిర్ణయించాయి. ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు