డార్లింగ్ ప్రభాస్ తన ఆతిథ్యంతో మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పనిచేసే నటీనటులకు ఇంటి భోజనం రుచి చూపించడం ప్రభాస్‌కు అలవాటు. గతంలో 'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో చెన్నై నుండి ముంబైకి ఆహారం తెప్పించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు తన తాజా చిత్రం 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీకి భారీ ఫుడ్ ట్రీట్ ఇచ్చారు. రకరకాల స్టార్టర్స్, బిర్యానీ, స్వీట్స్‌తో కూడిన విందును ఆయన పంపించగా, ఆ ఫోటోలను ఇమాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం ఆరు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ఫౌజీ'ని 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ క్రేజ్, హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద స్పెషల్‌గా నిలుపుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.