Current Date: 05 Oct, 2024

పాత సంగతి మరిచి జనసేనకి జైకొట్టిన నటి హేమ

బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి నటమి హేమ తెలుగులోనే కాదు కన్నడ మీడియాలో కూడా కొన్ని రోజులు హాట్ టాపిక్‌గా నిలిచింది. పార్టీలో హేమ ఉందని కర్ణాటక పోలీసులు చెప్పడంతో  తాను లేనంటూ బుకాయిస్తూ ఆమె వేసిన వేషాలు అన్నీఇన్నీ కావు. కానీ చివరికి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత బెయిల్‌పై రావడం చకచకా జరిగిపోయాయి. ఈ గొడవ తర్వాత చాలా రోజులు మీడియాకి దూరంగా ఉన్న హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తనకి ఏ పాపం తెలియదంటూ బోరున ఏడ్చింది. సోమవారం నాడు రేవ్ పార్టీ జరిగితే తాను ఆదివారం నాడు బర్త్ డే పార్టీకి వెళ్లాలంటూ సరికొత్త కథనాలు వినిపించింది. మధ్యలో జనసేన ప్రస్తావన వచ్చింది. దాంతో జై జనసేన జై కాపు జై జై కాపు అంటూ మద్దతు పలికింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి హేమ మద్దతు ప్రకటించింది. యాంకర్ శ్యామలతో కలిసి వెళ్లి జగన్‌ని కలిసి వైసీపీ పార్టీలో చేరింది. కానీ ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే జనసేనకి మద్దతు పలికింది.

Share