Current Date: 27 Jul, 2026

సింహాచలం గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే!

సింహాచలం గిరిప్రదక్షిణ మార్గాన్ని దేవస్థానం అధికారులు వెల్లడించారు. తొలిపావంచ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, కంచరపాలెం, మాధవధార, ఎన్ఎస్టీఎల్, ప్రహ్లాదపురం మీదుగా సాగుతుంది. చివరగా భక్తులు కొండదిగువ తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో ఈ మహా ప్రదక్షిణ ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ గిరిప్రదక్షిణ 32KM కొనసాగనుంది.