Current Date: 27 Nov, 2024

కేసీఆర్‌కి మళ్లీ నోటీసులు.. బిగిస్తున్న ఉచ్చు!

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్... జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయగా.. ఈ ఈ కమిషన్.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తోంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జూన్ 11న ఒకసారి నోటీసులు జారీ చేయగా.. దానికి సరైన సమాధానం లభించలేదు. దాంతో మరోసారి కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు కమిషన్‌కు వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో అడిగింది.నోటీసులపై ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను కమిషన్ ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, మరికొంత మందికి కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.

Share