‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్, నటుడు అర్పిత్ రంకాతో కలిసి కేదార్నాథ్, బద్రీనాథ్ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు.పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను ‘కన్నప్ప’ టీం సందర్శించింది. ఆపై బద్రీనాథ్‌లో ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ ట్రిప్పై విష్ణు మంచు మాట్లాడుతూ.. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా ఎపిక్ యాక్షన్ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నామని అన్నారు.ప్రస్తుతం విష్ణు మంచు షేర్ చేసిన ఈ తీర్థయాత్ర ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.