Current Date: 02 Apr, 2025

బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్...

నేరాలను అదుపులో ఉంచాలని, లేదంటే ప్రభుత్వ విశ్వసనీయతను అందరూ ప్రశ్నిస్తారని, ఆ పరిస్థితి రాకూడదని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇతర నేరాలు తగ్గాయి. కానీ ఆర్థిక నేరాలు పెరిగాయి. గంజాయి సాగు బాగా తగ్గింది. వినియోగం ఇంకా తగ్గించాలి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొద్దాం. అది గ్యాంబ్లింగ్‌ను సైతం అరికట్టేలా ఉంటుంది. నేరస్థులు చాలా తెలివిగా సాక్ష్యాలు దొరక్కుండా మాయం చేస్తారు. పారిపోయే వారు కొందరైతే, పక్కవారిపై నేరాన్ని తోసేవారు మరికొందరు. వివేకానందరెడ్డి హత్య కేసు అందుకు ఉదాహరణ. ఐవోలు అప్రమత్తంగా ఉంటూ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేరాలు తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవాలి. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తీసుకోవాలని ఆదేశించారు.

Share