విజయనగరం ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను రథయాత్ర మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. సిరిమాను రథంపై ప్రత్యేక పీఠాన్ని అధిరోహించిన పూజారి రూపంలో ఉన్న పైడితల్లి అమ్మవారికి భక్త జనం నీరాజనం పలికారు. మూడు లాంతర్ల వద్ద ఉన్న అమ్మవారి చదురు గుడి నుంచి కోట వరకు మూడుసార్లు సినిమాలు కలియతిరిగింది. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్ఛారణం మధ్య సంప్రదాయ బద్ధంగా సాగిన సినిమాను రథయాత్రను లక్షలాదిమంది భక్తులు తిలకించి పులకించి పోయారు. సినిమాను రథయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. నగరం అంతా శ్రీ పైడిమాంబ నినాదాలతో మార్మోగింది. సంప్రదాయ బద్దంగా అంజలి రథం తెల్ల ఏనుగు బేస్తరి ఇవ్వాలా పాలధార వెంట రాగా సినిమాను రధం ముందుకు సాగింది. మధ్యాహ్నం వరకు పలువురు భక్తులు చదురు గుడి లో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కళా ప్రదర్శనలు వేషాలతో పలువురు భక్తులు అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు.