ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. చైనా వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సౌత్ కొరియాను 4-1తో చిత్తు చేసిన భారత్.. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గెలుపు జెండా ఎగురవేసింది.భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరొక గోల్ చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్ చివరలో ఉత్తమ్ భారత్‌కు తొలి గోల్ అందించగా. హర్మన్‌ప్రీత్ రెండో క్వార్టర్ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్ కిక్‌ను గోల్‌గా మలిచాడు. మూడో క్వార్టర్‌లో కొరియా కూడా గోల్ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్ కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు.ఆసియా చాంపియన్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. లీగ్ దశలో చైనాను 3-0తో, జపాన్‌ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో భారత్ తలపడనుంది.