ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోమారు అగ్రస్థానాన్ని అలంకరించిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అంతలోనే ఓ బ్యాడ్ న్యూస్ పలకరించింది. గత సీజన్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే, ఆ సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే దానిని అమలు చేయనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ ఆడకుండా పాండ్యాపై నిషేధం విధించారు. ఈ సీజన్లో పాండ్యా కొత్త జట్టుతో బరిలోకి దిగినా నిషేధం మాత్రం అమల్లోనే ఉంటుంది. పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతోపాటు రూ. 30 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ అతడు బరిలోకి దిగకూడదు. ఇక, ఆ మ్యాచ్‌లోని ఒక్కో ఆటగాడిపై రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.