భారత్‌కి టీ20 వరల్డ్ కప్ అందించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి సియెట్ క్రికెట్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకుంటున్న సమయంలో ద్రవిడ్ కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇండియన్ క్రికెట్‌కు అతడు అందించిన సేవలకుగాను ఈ అవార్డు అందించారు.ప్లేయర్‌గా వరల్డ్ కప్ అందుకోలేకపోయిన ద్రవిడ్..కోచ్‌గా టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడాడు. 18 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో ఇండియా తరఫున అతడు 164 టెస్టులు, 244 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టెస్టుల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో వాల్‌గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లికి ఈ సియెట్ క్రికెట్ అవార్డుల్లో బెస్ట్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, మహ్మద్ షమీకి బెస్ట్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.