ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవి మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాళం చెవి మాయమవడంతో డూప్లికేటు తాళాల సాయంతో ప్రభుత్వ అధికారుల బృంధం రత్న భాండాగారం తెరచేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాదాపు 46 యేళ్ల తర్వాత నిథి సంరక్షణ, జాబితాను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అనూహ్యంగా తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాళాల మిస్సింగ్, తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ విషయాలన్నింటినీ తేల్చాలంటే భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమని ఆయన అన్నారు. డూప్లికేట్ తాళం చెవుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.
Share